రస్టిక్ కంటెంట్తో పొట్టేల్.. మ్యూజికల్‌‌‌‌‌‌‌‌గా ప్రయోగం చేశా: మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర

రస్టిక్ కంటెంట్తో పొట్టేల్.. మ్యూజికల్‌‌‌‌‌‌‌‌గా ప్రయోగం చేశా:  మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర

‘పొట్టేల్’ చిత్రం మ్యూజికల్‌‌‌‌‌‌‌‌గా సరికొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ను ఇస్తుందని సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర చెప్పాడు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి శేఖర్ సంగీతం అందించాడు.

ఈ నెల అక్టోబర్ 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ ‘ఈ కథ వినగానే బాగా కనెక్ట్ అయ్యాను. పిల్లల చదువు కోసం పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అయినా పడాలి అనే మంచి సందేశం ఇందులో ఉంది. విలేజ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సాగే కథ ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా ఉంటుంది.

రూరల్ బ్యాక్ డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ‘అంబాజీపేట’ లాంటి సినిమాలు చేశా. కానీ 'పొట్టేల్' డిఫరెంట్. ఏదో సినిమాకి రీ రికార్డింగ్ చేసినట్లు ఉండదు. సిచ్యువేషన్ నుంచి మ్యూజిక్ క్రియేట్ అవుతున్నట్లుగా ఉంటుంది.డీఫాల్ట్ టెంప్లెట్ ఉండే మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ని ఇందులో చేయలేదు. నిజానికి ఎలాంటి సౌండింగ్ చేయాలా అనేది కొంచెం వెతుక్కోవాల్సి వచ్చింది. ఒకసారి సెట్ అయిన తర్వాత ఆర్ఆర్, సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి.

ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని సాంగ్స్ అన్ని కాసర్ల శ్యామ్ ఒక్కరే రాశారు. ప్రతి లిరిక్ కథకు చాలా ఇంపార్టెంట్. ఒక విలేజ్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రూరల్‌‌‌‌‌‌‌‌గా కాకుండా కొంచెం వెస్ట్రన్ స్టైల్‌‌‌‌‌‌‌‌లో ప్రయోగం చేశా. నిర్మాతలు సినిమాని బలంగా నమ్మారు. మ్యూజిక్ విషయంలోనూ చాలా సపోర్ట్ చేశారు’ అని చెప్పాడు.