సత్యభామ సాంగ్స్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్ అవుతారు

సత్యభామ సాంగ్స్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్ అవుతారు

తనదైన మ్యూజిక్‌‌‌‌‌‌‌‌తో కొత్తదనాన్ని అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు శ్రీచరణ్ పాకాల. తాజాగా కాజల్ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించిన ‘సత్యభామ’ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సుమన్ చిక్కాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను  బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. జూన్ 7న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ ‘కాజల్ ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గా చేసిన సినిమాకు సంగీతం అందించడం హ్యాపీగా అనిపించింది. అలాగే సమర్పకుడిగా వ్యవహరించిన శశి కిరణ్ తిక్క, డైరెక్టర్ సుమన్ నాకు మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి చేశాను కాబట్టి ఎక్సయిటింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. 

కాజల్‌‌‌‌‌‌‌‌కు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ మూవీ ఇదని అనుకోవచ్చు. ఇందులో ఆమె చేసిన  యాక్షన్ సీక్వెన్సులు చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశా. బిడ్డ పుట్టిన తర్వాత తను ఇంత భారీ యాక్షన్ సీక్వెన్సులు చేయడం అంత ఈజీ కాదు. ఆ యాక్షన్ సీక్వెన్సులు చూసి నేను ఇన్‌‌‌‌‌‌‌‌స్పైర్  అయ్యి మ్యూజిక్ చేశా. ఇందులో  మొత్తం ఐదు పాటలుంటాయి. ముందు రెండు సాంగ్స్ అనుకుని స్టార్ట్ చేశాం. కళ్లారా చూసాలే అనేది కాజల్, నవీన్ చంద్ర మధ్య వచ్చే లవ్ సాంగ్, వెతుకు వెతుకు కీరవాణి గారు పాడారు. ఇది కాజల్ కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంగా ఉంటుంది. అలాగే  ఒక ఇంగ్లీష్ సాంగ్ కూడా  ఉంటుంది. ఇందులోని సాంగ్స్‌‌‌‌‌‌‌‌కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అలాగే  థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.