గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పోటికల్ థ్రిల్లర్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా..బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇటీవలే ప్రొడ్యూసర్ దిల్ రాజు డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ ఉంటుందని తెలిపారు. అయితే, ఈ మూవీ నుంచి ‘జరగండి.. జరగండి’ సాంగ్ మినహా మరే ఎలాంటి మేజర్ అప్‍డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో జూలై 23న హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్లో గేమ్ ఛేంజర్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కొన్ని విషయాలు పంచుకున్నారు.
Also Read:-ఇండియాలోనే నెం.1..'పుష్ప 2'.. దేవర ఎన్నో స్థానం అంటే? IMDB జాబితా ఇదే
"గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఆగస్టు చివరివారంలో వరుస అప్డేట్స్ వస్తాయని..ఇక సెకండ్ సాంగ్ కూడా అప్పుడే వస్తుందని హింట్ ఇచ్చారు. త్వరలో డైరెక్టర్ శంకర్ సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్ చేయాల్సి ఉందని అన్నారు. లాగే ఈ సినిమాలో మొత్తానికి ఏడు పాటలు ఉంటాయని..వచ్చే సెకండ్ సాంగ్ మాత్రం ఎలాంటి లీకులు జరగక ముందే రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ సినిమా గురించి కొంత కాలంగా ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. గేమ్ ఛేంజర్ సినిమాకు పార్ట్ 2 రానుందని. దాంతో ఆ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇక ప్రమోషన్స్ షురూ చేస్తే గానీ, సెకండ్ పార్ట్ పై క్లారిటీ వస్తోంది.