SS Thaman: ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్.. ఎప్పుడంటే?.

SS Thaman: ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్.. ఎప్పుడంటే?.

దేశవ్యాప్తంగా క్రికెట్ లవర్స్కు ఐపీఎల్ ఫీవర్ వచ్చేసింది. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. గురువారం మార్చి 27 రాత్రి 7:30 గంటలకు ఉప్పల్లో లక్నోతో సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్కు వచ్చే ప్రేక్షకుల కోసం, మ్యాచ్ ప్రారంభానికి ముందు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన మ్యూజికల్ ఈవెంట్తో షురూ చేయనున్నారు.

Also Read:-గుజరాత్ vs పంజాబ్: హెడ్ టు హెడ్ రికార్డ్.. పిచ్ రిపోర్ట్ ఇదే..

తాజాగా (మార్చి 25న) ఐపీఎల్ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఐపీఎల్ జరుగుతున్న పలు స్టేడియాల్లో మ్యాచ్ కు ముందు ఇదే తరహాలో మ్యూజికల్ ఈవెంట్స్ బీసీసీఐ నిర్వహిస్తోంది.

ప్రస్తుతం తమన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఖాళీ సమయాల్లో తమన్‌కు ఇష్టమైన క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాగే ఇతర షోలు, ఈవెంట్లు కూడా చేస్తుంటాడు. ఈక్రమంలోనే ఇటీవలే ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం ఓ మ్యూజికల్ కాన్సర్ట్ కూడా నిర్వహించాడు. ఇపుడు క్రికెట్ లవర్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి హైదరాబాదీ ఫ్యాన్స్ కోసం మ్యూజికల్ ఈవెంట్ కు శ్రీకారం చుట్టాడు.