టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోఇసారి గొప్ప మనసు చాటుకున్నాడు. తలసేమియా భాదితులకు సహయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ ఫిబ్రవరి 15న విజయవాడలో మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చాడు. మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు అతిథులుగా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తలసేమియా భాదితులకు సహయార్థం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించమని నారా భువనేశ్వరి అడిగారని, ఎలాంటి అవకాశం రావడం తనకి ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే నన్ను నమ్మి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన నారా భువనేశ్వరికి దన్యవాదాలు తెలిపాడు.
ALSO READ | TFCC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా ఛాంబర్ నుంచే అవార్డులు
ఇక నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం పగలు రాత్రి పని చేస్తున్నారని అన్నారు. అలాగే ఈ మ్యూజికల్ నైట్ పై వచ్చే ప్రతీ రూపాయి ప్రతి రూపాయి తలసేమియా భాదితులకు వెళ్తుందని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి స్పందిస్తూ సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుందని బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంది జీవితాలు నిలబడతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. తలసేమియా భాదితుల సహాయార్థం మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు చెప్పగానే తమన్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఈ షో ఫ్రీ గా చేస్తా అని గొప్ప హృదయంతో చెప్పారని తెలిపింది.
సమాజ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలి, అలాగే తెలుగు తల్లి రుణం తీర్చుకోవాలని సూచించారు. మనం వెళ్ళేటప్పుడు మన వెంట డబ్బు రాదు...ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అందరికి గుర్తు ఉంటుందని పేర్కొంది.