TheyCallHimOG: నా ట్వీట్ పిన్ చేసి పెట్టుకోండి.. ఓజీ మూవీపై తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్

TheyCallHimOG: నా ట్వీట్ పిన్ చేసి పెట్టుకోండి.. ఓజీ మూవీపై తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(OG). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సిజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

పవన్ నుండి వస్తున్న సినిమాల్లో ఓజీ సినిమాకు సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. దానికి కారణం ఈ సినిమాలో పవన్ మొదటిసారి గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రేండింగ్ లోకి వస్తోంది. 

ఇక తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పవన్ ఫ్యాన్స్ ఓజీ సినిమా అప్డేట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న నేపధ్యంలో.. మేకర్స్ త్వరలో అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా సాంగ్స్, మేకింగ్ ఇలా ప్రతి విషయంలో డైరెక్టర్ సుజీత్ అదిరే ప్లానింగ్ చేస్తున్నాడు. తదుపరి ఓజీ నుంచి రాబోయే సింగిల్ ప్రతిఒక్కరిని కట్టిపడేస్తోంది. ఈ అక్టోబర్లో హార్ట్ వార్మింగ్ మెలోడీ అందరి హృదయాలను టచ్ చేస్తోందని తెలిపారు.

మా నుండి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ రాబోతుంది. అది ఇచ్చేంతవరకు సుజీత్ ప్రయత్నం చేస్తూనే ఉంటాడడని.. అలాగే కెమెరామెన్ రవిచంద్రన్ అదిరిపోయే విజువల్స్ ఇచ్చాడు. ఇప్పుడు నేను OG కు బెస్ట్ ఇవ్వాలి. ఇది DVV మూవీస్ బ్యానర్కు బిగ్గెస్ట్ సినిమా అవుతుంది. నా ట్వీట్ పిన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్తో త్వరలో కలుద్దాం అని" తమన్ ట్వీట్లో వెల్లడించాడు.