డిజప్పాయింట్ అవ్వకండి అబ్బాయిలు.. దసరాకు కాకపోతే దీపావళి: తమన్ ట్వీట్స్ వైరల్

డిజప్పాయింట్ అవ్వకండి అబ్బాయిలు.. దసరాకు కాకపోతే దీపావళి: తమన్ ట్వీట్స్ వైరల్

గేమ్ ఛేంజర్ టీజర్ విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (అక్టోబర్ 2న) ఓ నెటిజన్ కి దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్' అంటూ రిప్లై ట్వీట్ చేస్తూ ఆశలు పెంచగా..ఇపుడు తాజాగా (అక్టోబర్ 8న) మరో నెటిజన్ కి 'దసరాకి టీజర్ రావట్లేదని డిజప్పాయింట్ అవ్వకండి అబ్బాయిలు!..

గేమ్ ఛేంజర్ మూవీ సీజీ వీఎఫ్‍ఎక్స్ ఫైనల్ ఎడిటింగ్, డబ్బింగ్ పనులు సాగుతున్నాయి. బీజీఎం స్కోర్ ఇప్పటికే మొదలైంది. అన్ని పాటలకు లిరికల్ వీడియోలు తయారవుతున్నాయి. ప్రతీ నెల రిలీజ్ చేస్తాం. ఈనెల అక్టోబర్ 30న మూడో పాట వస్తుంది” అని తమన్ ట్వీట్ లో వెల్లడించారు.

అలాగే పాటల కంటే ముందు టీజర్‌పై క్లారిటీ ఇవ్వాలని వచ్చిన ఓ నెటిజన్ ట్వీట్‍కు తమన్ రియాక్ట్ అవుతూ..సినిమా అద్భుతంగా ఉండేలా పోస్ట్ ప్రొడక్షన్ పనులు లార్జ్ స్కేల్‍లో భారీగా సాగుతున్నాయి.. అదిరిపోయే రేంజ్ లో హైఫ్లోతో టీజర్ కంటెంట్ వస్తుంది..కానీ, దసరాకు కాకపోతే దీపావళికి వస్తుందని తమన్ తెలిపారు.

ALSO READ | బిగ్ బాస్ లోకి మహేష్ బాబు మరదలు...

అందుకు ప్రతిఒక్కరు పాజిటివ్‍గా ఉండాలని, గేమ్ ఛేంజర్ టీమ్ కి మద్దతునివ్వాలని ట్విట్టర్ X ద్వారా అభిమానుల్ని కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇకపోతే సినిమా రిలీజ్ విషయానికి వస్తే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న రిలీజ్ ఉండనుందని టాక్.