
టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్ థమన్ కు క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఇంటర్వ్యూల్లో అతను తనకు క్రికెట్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. సినిమాల్లో వాయించడమే కాదు క్రికెట్ లోనూ పరుగుల సునామీ సృష్టించగలడు. తనదైన బ్యాటింగ్ తో పవర్ హిట్టింగ్ తో ఆకట్టుకున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్.. గురువారం (మార్చి 27) ఉప్పల్ స్టేడియంలో తన పెర్ఫార్మెన్స్ తో అభిమానులని ఎంటర్టైన్ మెంట్ చేశాడు.
ప్రస్తుతం ఉప్పల్ వేదికగా ;లక్నో సూపర్ జయింట్స్, సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు థమన్ తన మ్యూజిక్ ప్రదర్శనతో హోరెత్తించాడు. ముగ్గురు సింగర్లు పాటలు పాడుతుండగా డ్రమ్స్ కొడుతూ ఫ్యాన్స్ కు మ్యాచ్ కు ముందే ఫుల్ పైకి ఇచ్చాడు. వెనక ఉన్న డ్యాన్సర్లు ఆరెంజ్ డ్రెస్ వేసుకొని తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ ఓడిపోయింది. లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్ చేస్తుంది.
Also Read :- ఆ ముగ్గురు ఏం తింటున్నారు.. హిట్టర్లు కాకపోయినా సిక్సర్లు కొడుతున్నారు
ప్రస్తుతం తొలి 10 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజ్ లో క్లాసన్ (14), నితీష్ కుమార్ రెడ్డి (23) క్రీజ్ లో ఉన్నారు. అభిషేక్ శర్మ వరుసగా రెండో మ్యాచ్ లో కూడా విఫలమయ్యాడు. కేవలం ఆరు పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికే ఇషాన్ కిషాన్ డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే హెడ్ మాత్రం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 28 బంతుల్లోనే 47 పరుగులు చేసి ఔటయ్యాడు.