డాకు మహారాజ్ సక్సెస్ మీట్ (జనవరి 17న) జరిగింది. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (SS Thaman) సినిమా గొప్పదనం గురించి, తెలుగు సినిమాలకు సంబంధించిన ట్రోలింగ్ పై మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాటలకూ చలించిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) X ద్వారా 'నీ ఆవేదన చూసి నా కళ్లలో నీళ్లొస్తున్నాయ్ థమన్' అంటూ స్పందించారు.
తాజాగా చిరు స్పందనపై తమన్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు."డియర్ అన్నయ్యా... మీ మాటలు నాకు 'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన....అన్న భగవద్గీత శ్లోకాన్ని' గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా... ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని... కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. నన్ను అర్ధం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తు ఉంటాయి #Long live Cinema" అంటూ థమన్ పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం చిరు, థమన్ ల పోస్ట్ సినిమా ఇండస్ట్రీ వ్యక్తులను, తెలుగు సినీ ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయి. ఏదేమైనా ప్రస్తుత కాలంలో సినిమాపై జరుగుతున్న సోషల్ మీడియా దాడి.. ఎంతో మంది సినీ వ్యక్తుల జీవితాలను కూల్చేస్తుంది. సినిమా విడుదలకు ముందే నెగిటివ్ హ్యాష్ ట్యాగ్ ఠీ ట్రెండ్ చేయడం ప్యాషన్ అయిపోయింది. అంతేకాకుండా ఫస్ట్ షోతోనే అస్సలు సినిమానే బాలేదంటూ పోస్టులు పెట్టడం, ఆన్ లైన్ లో హెడీ ప్రింట్ లీక్ అవ్వడం, టీవీలలో టెలికాస్ట్ చేయడం సినిమా బంగారు భవిష్యత్తును పడకొడుతున్నాయి. ఇదంతా ఇపుడు జరిగింది రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీకి. సోషల్ మీడియాలో లీక్ అవ్వడం, నెగిటివిటీ వ్యాప్తి అవ్వడం జరిగాయి.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️ @KChiruTweets 🥁 ✊
— thaman S (@MusicThaman) January 18, 2025
డియర్ అన్నయ్యా... మీ మాటలు నాకు
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన....
అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి.
ఎంత కాదనుకున్నా మనుషులం కదా... ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది.
పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని... కళ్ళు… https://t.co/Z8ueYVXFUG