Thaman: టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వరుస ఆఫర్లు దకించుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మాస్ బీజియం అయినా, క్లాస్ మెలోడీ అయినా తనదైన శైలిలో ట్యూన్ చేసి మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తుంటాడు. అంతేగాకుండా సహాయం అని ఎవరైనా ఇంటికొస్తే లేదనుకుండా తనకి తోచినంత సహాయం చేస్తుంటాడు. అయితే ఇటీవలే తమన్ తన పుట్టిన రోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో తనకి మ్యూజిక్ తర్వాత క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టమని తెలిపాడు. అలాగే తాను స్ట్రెస్ లో ఉన్నా, టెన్షన్స్ లో ఉన్నా వెంటనే క్రికెట్ ఆడటానికి వెళ్ళి రీఫ్రెష్ అవుతానని చెప్పుకొచ్చాడు. ఇక కొత్త ట్యూన్స్ విషయంలో స్టక్ అయినప్పుడు కూడా క్రికెట్ ఆడటానికి వెళ్లొస్తే కొత్త ట్యూన్స్ ఐడియాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అందుకే తాను పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ స్నేహితులతో కలసి తప్పకుండా క్రికెట్ ఆడతానని చెప్పుకొచ్చాడు.
Also Read : పుష్పరాజ్ నిజంగానే వైల్డ్ ఫైరేనబ్బా
సొంతంగా మ్యూజిక్ స్కూల్ నిర్మించి టాలెంట్ ఉన్నటువంటి పేద విద్యార్థులకి ఉచితంగా మ్యూజిక్ నేర్పించాలనేది తన డ్రీమ్ అని తెలిపాడు. అలాగే మ్యూజిక్ ఉన్నచోట క్రైమ్ రేట్ కూడా తక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న తమన్ అభిమానులు "రియల్లీ గ్రేట్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమన్ తెలుగుతోపాటూ హిందీ సినిమాలకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే తెలుగులో ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్, అఖండ 2, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి, సుకుమార్ పుష్ప 2 : ది రూల్ (బీజియం స్కోర్ మాత్రమే), అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ హిందీలో నిర్మిస్తున్న జాట్ అనే సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు.