మాదాపూర్​లో సంగీత​ సమరోహ్ షురూ

మాదాపూర్​లో సంగీత​ సమరోహ్ షురూ
  • చల్లని సాయంత్రాన సంగీత విందు
  • మాదాపూర్​లో సంగీత​ సమరోహ్ షురూ

మాదాపూర్, వెలుగు: పండిట్​ జస్రాజ్​కల్చరల్ ​ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పండిట్​మోతీరామ్,​ పండిట్​మణిరామ్ సంగీత​సమరోహ్ 52వ ఎడిషన్​ఆదివారం సాయంత్రం మాదాపూర్​లోని సెంటర్​ఫర్ కల్చరల్​రిసోర్స్ అండ్​ట్రైనింగ్​సెంటర్​లో ఘనంగా షురూ అయింది. 

ప్రఖ్యాత సంగీత విద్వాంసులు రమేశ్​నారాయణ్​మేవతి ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ అవార్డు గ్రహీత గాయని రేఖా భరద్వాజ్​సూఫీ పఠనం, టైమ్​లెస్​ మెలోడీస్​మ్యూజిక్​తో  ప్రేక్షకులను అలరించారు. ముఖ్య అతిథులుగా ఐఏఎస్​అధికారులు జయేశ్​రంజన్, అర్వింద్​కుమార్, అడిషనల్​డీజీపీ అంజనీ భగవత్ తదితరులు​పాల్గొన్నారు. ఈ నెల 30 వరకు సంగీత​సమరోహ్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సోమవారం ప్రముఖ నటి శోభన భరతనాట్యం, అభిషేక్​రఘురామ్​కర్నాటక సంగీతం, రిషి,  మహిమ ఉపాధ్యాయ్​పక్వాజ్​డ్యూయట్ ఉంటుందన్నారు.