Music Maestro Rashid Khan: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Maestro Rashid Khan:  ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ (Rashid Khan) (55) కన్నుమూశారు. కొంతకాలంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇవాళ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు రషీద్‌ ఖాన్‌ మృతదేహాన్నికోల్‌కతాలోని పీర్‌లెస్ హాస్పిటల్లో ఉంచనున్నారు. ఆ తర్వాత ఆయన భౌతికకాయాన్ని రాత్రికి కోల్‌కతాలోని పీస్ హెవెన్‌కు పంపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు జనవరి 10న (బుధవారం) జరగనున్నాయి.

మ్యూజిక్‌ మ్యాస్ట్రో రషీద్‌ఖాన్‌ సినిమా రంగంలో చేసిన కృషికి గాను ఆయనకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులులతో సత్కరించింది. ఆయన మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కాగా అభిమానుల సందర్శనార్ధం కొరకు ఆయన భౌతికకాయాన్ని రవీంద్ర సదన్‌లో ఉంచనున్నారు. 

రషీద్‌ ఖాన్‌ ఇష్కేరియా, షాదీ మైన్, ఆవోగే జబ్ తుమ్, ఆజ్ కోయి జోగీ ఆవే, రిష్టే నాతే, కర్లే ప్యార్ కర్లే, ఇష్క్ కా రంగ్,మౌసమ్,హేట్ స్టోరీ2, రాజ్ వంటి అనేక సినిమాలకు అయన సంగీతం అందించి మ్యూజిక్ మాస్ట్రోగా నిలిచారు.