హైదరాబాద్ దుర్గం చెరువులో మ్యూజికల్ ఫౌంటేయిన్స్

ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ లోని దుర్గం చెరువు వద్ద మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌లను ప్రారంభించారు. ఇవి నగరానికే కొత్త ఆకర్షణగా నిలిచాయి. రూ.8 కోట్లకుపైగా ప్రాజెక్టు వ్యయంతో ల్యాండ్‌స్కేపింగ్‌తో పాటు మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌లను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసింది.

200 మంది సీటింగ్ కెపాసిటీతో, ప్రతి రోజు నగరవాసులు రాత్రి 7 నుంచి 10 గంటల మధ్య 15 నిమిషాల మూడు షోలను, వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాల్లో నాలుగు షోలను ఆస్వాదించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిపై ప్రజలు, విజిటర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.