జులై 3 నుంచి 12 వరకు నిర్వహించే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ (మ్యూజీషియన్) రిక్రూట్‌మెంట్ ర్యాలీలో భాగంగా 3 ఏఎస్‌సీ ఎయిర్‌ఫోర్స్ సంస్థ కాన్పూర్, 7 ఏఎస్‌సీ 1 కబ్బన్ రోడ్, బెంగళూరు (కర్ణాటక)లో పాల్గొనేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అర్హతలు: అభ్యర్థులు (పురుషులు, మహిళలు) అవివాహితులై, 2 జనవరి 2004 నుంచి 2 జులై 2007 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత లేదా సమాన విద్య కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలని, ఒక ప్రిపరేటరీ ట్యూన్, స్టాఫ్ నొటేషన్/టాబ్లేచర్/టానిక్ సోల్ఫా/ హిందుస్తానీ, కర్నాటిక్ మ్యూజిక్ మొదలైన వాటిని ప్రదర్శించాలని పేర్కొన్నారు.
దరఖాస్తులు: ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 22 ఉదయం 11 గంటల నుంచి జూన్ 5 రాత్రి 11 గంటల వరకు వెబ్ పోర్టల్ www.agnipathvayu.cdac.in లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీ పూర్తి వివరాలకు సదరు వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.