మస్క్ డిసిషన్ మేకర్ కాదు..సలహాదారు మాత్రమే.. :వైట్హౌజ్

మస్క్ డిసిషన్ మేకర్ కాదు..సలహాదారు మాత్రమే.. :వైట్హౌజ్

ట్రంప్ ప్రభుత్వంలో టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిసియెన్సీ (DOGE) పర్యవేక్షకుడిగా ఎలాన్ మస్క్ ను నియమించినప్పటికీ డాగీలో మస్క్ డాగీ ఉద్యోగి కాదని.. అతనికి ఎలాంటి నిర్ణయాధికారం లేదని వైట్ హౌజ్ వర్గాలు చెబుతున్నాయి.  

మస్క్ పాత్ర అధ్యక్షుడికి సలహాలు ఇవ్వడం, అతని ఆదేశాలు తెలియజేయడం మాత్రమే నని ఇతర సీనియర్ సలహాదారుల మాదిరిగా మస్క్ కు ప్రభుత్వ నిర్ణయాలు స్వయంగా తీసుకునే రైట్స్ లేవని వైట్ హౌజ్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ స్పష్టం చేశారు. న్యూమెక్సికో రాష్ట్రం ఇటీవల మస్క్ పై కోర్టు లో వేసిన కేసుకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేశారు. 

ట్రంప్ పాలనలో మస్క్ జోక్యం చాలా ఉందని తెలిసిందే.. అమెరికా ఎఫిసియెన్సీ శాఖ లో స్పెషల్ గవర్నమెంట్ ఉద్యోగిగా  మస్క్ తన మార్క్ ను చూపిస్తున్నారు. అన్ని శాఖల్లో వృధాఖర్చు ను గుర్తించి తొలగించే పనిలో పడ్డారు. మస్క్ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. గత నెలలో ట్రంప్ రెండో సారి అధికారం చేపట్టాక ట్రంప్ పరిపాలన ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 

అయితే ఎలాన్ మస్క్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మంచి నమ్మకస్తుడు. ప్రభుత్వశాఖల్లో వృధాఖర్చు విషయంలో మస్క్ సలహాలు బాగా పనికొచ్చాయని.. ఇకముందు కూడా విద్యాశాఖ లాంటి మరికొన్ని శాఖలను మస్క్ తనిఖీలు చేస్తారని ఇటీవల ట్రంప్ ప్రశంసించారు.

అయితే మస్క్ పోస్ట్ చట్టపరం అనేది పరిశీలనలో ఉంది. అమెరికా ప్రభుత్వ కార్యక్రమాల్లో మస్క్ ప్రమేయాన్ని సవాల్ చేస్తే.. వివిధ ఫెడరల్ కోర్టుల్లో దాదాపు 20 పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో మస్క్ ప్రమేయంపై ఫెడరల్ కోర్టులు ప్రశ్నించేలా చేశాయి.