Donald Trump: ఎలాన్ మస్క్‘డాగీ’ మూసివేత?..క్లారిటీ ఇచ్చిన ట్రంప్

Donald Trump: ఎలాన్ మస్క్‘డాగీ’ మూసివేత?..క్లారిటీ ఇచ్చిన ట్రంప్

టాప్ బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నేతృత్వంలో డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(DOGE)  ట్రంప్ ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కొత్త ప్రభుత్వంలో ఖర్చులను ఎలా తగ్గించాలి..ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎలా బలోపేతం చేయాలనే అంశాలను దృష్టిలో ఉంచుకొని డాడీ ఏరివేత కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా అమెరికా ఫెడరల్ ఉద్యోగుల్లో దాదాపు 80 వేల మందిని తొలగించారు. అడ్మినిష్ట్రేషన్ విభాగంలో డాగీ నిర్ణయాలతో ప్రభుత్వానికి దాదాపు1ట్రిలియన్ డాలర్లు ఆదా చేసినట్లు ఎలాన్  మస్క్ ఇప్పటికే ప్రకటించారు.అయితే ఎలాన్ మస్క్ డాగీ త్వరలో మూసివేయబడుతుందా? ఎలాన్ మస్క్ డాగీ బాస్ గా వైదొలుగుతున్నారా.. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.  

ALSO READ | మయన్మార్​ భూకంప మృతుల సంఖ్య 2,700.. 4,521 మందికి గాయాలు..441 మంది గల్లంతు

టెస్లా సీఈవో కార్పొరేట్ బాధ్యతల గురించి మాట్లాడిన ట్రంప్ ..త్వరలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని DOGE మూసివేయబడుతుందని ప్రకటించారు. మస్క్ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలనుకున్నప్పటికీ బిలియనీర్ ఎలాన్ మస్క్ తన వ్యాపారం దృష్టించాల్సి ఉంది కాబట్టి డాగీ విషయంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మే నెలలో డాగీ మూసివేయనున్నట్లు ట్రంప్ చెప్పారు.