Xను అమ్మేసిన ఎలాన్ మస్క్..ఎవరికంటే

Xను అమ్మేసిన ఎలాన్ మస్క్..ఎవరికంటే

న్యూయార్క్: టెక్ దిగ్గజం, వరల్డ్ నంబరవన్ బిలియనీర్ ఎలెన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫాంXను అమ్మేశాడు. అయితే అది వేరే ఎవరికో మాత్రం కాదు. తన నేతృత్యంలోనే నడిచే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్ ఏఐ(xAI)కి విక్రయించినట్లు ప్రకటించారు.33బిలియన్ డాలర్లకు Xను విక్రియించినట్లు తెలిపారు.

2022లో ట్విట్టర్ను 44మిలియన్ డాలర్లకు మస్క్ కొన్నారు. ఆ తర్వాత దాని పేరును Xగా మార్చారు. ఇక ChatGPTకి పోటీగా ఎలాన్ మస్క్ గతేడాది xAI పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం Xకు 600 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. రెండింటి కలయికతో Xపరిధి మరింత పెరుగుతుందని చెప్పిన మస్క్...తాజాగా xAIవిలువ 80 బిలియన్ డాలర్లుగా నిర్థారించారు.

 X అమ్మకంపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. xAI, X ఫ్యూచర్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది.. ఇవాళ అధికారికంగా డేటా, మోడల్స్,కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్, టాలెంట్ ఒకే గొడుగుకిందకు ఒక అడుగు ముందుకు వేశామని ఎలాన్ మస్క్ Xలో పోస్ట్ షేర్ చేశారు. 

ALSO READ | ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..DOGE నుంచి తప్పుకుంటున్నాడు..డేట్ ఫిక్స్