ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం కోటా..కర్నాటక కేబినెట్ ఆమోదం

ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం కోటా..కర్నాటక కేబినెట్ ఆమోదం

బెంగళూరు: ముస్లిం కాంట్రాక్టర్లకు ప్రభుత్వ టెండర్లలో 4% కోటాను కర్నాటక ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కర్నాటక ట్రాన్స్ పరెన్సీ ఇన్  పబ్లిక్  ప్రొక్యూర్​మెంట్ (కేటీపీపీ) యాక్ట్​కు సిద్దరామయ్య సర్కారు సవరణ చేసింది. ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4% రిజర్వేషన్​ను ప్రవేశపెట్టింది.ముస్లిం లు ఎక్కువుండే కేటగిరి 2బీకి కేటీపీపీ చట్టం కింద రిజర్వేషన్  పాలసీని విస్తరిస్తున్నామని సీఎం సిద్దు తన బడ్జెట్  ప్రసంగంలో తెలిపారు. ఇప్పటివరకు ఎస్సీలు, ఎస్టీలు, కేటగిరి 1, కేటగిరి 2ఏ వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. కేటగిరి 1లో  వెనుకబడిన తరగతుల వారితో పాటు 17 ముస్లిం కమ్యూనిటీలు ఉండగా.. కేటగిరి 2ఏలో చాలా మంది వెనుకబడిన వారు ఉన్నారు.