అభివృద్ధికి దూరంగా ముస్లింల బతుకులు: అట్టడుగున బెంగాల్

సచార్–2006 రిపోర్టు దేశంలోని ముస్లిం మైనారిటీలందరిలో ఆశలు రేపింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ లో ముస్లిం మైనారిటీల జీవన పరిస్థితులు ఏమాత్రం బాగో లేవని స్పష్టం చేసింది. సచార్‌‌‌‌‌‌‌‌ రిపోర్టు అందిన దశాబ్దం తర్వాత సోషల్ సైంటిస్టులు దేశంలోని ముస్లింల స్థితిగతులపై పరిశీలన జరిపారు. దశాబ్దం కిందటి పరిస్థితులతో పోలిస్తే మైనారిటీల పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది తప్ప, వారి జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదని క్లారిటీ ఇచ్చారు.

దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అనేక వర్గా లు సామా జికంగా, రాజకీయంగా దూసుకుపోతుంటే ముస్లింలు మాత్రం ఈ పరుగు పందెంలో లేరనే చెప్పొచ్చు. 70 ఏళ్ల ఇండిపెండెన్స్ తర్వాత కూడా ముస్లింల జీవన పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. దీనికితోడు సౌత్ తో పోలిస్తే నార్త్ ఇండియాలోని ముస్లింలకు ఇన్ సెక్యూరిటీ పెరిగింది.

పేదరికం ఎక్కువే
ముస్లిం కమ్యూనిటీలో పేదరికం ఎక్కువగా ఉంది. పల్లెల్లో సెం ట్ భూమి లేనివాళ్లల్లో ఎక్కువ మంది ముస్లింలే. దీం తో వాళ్లు కూలీలుగా బతుకీడుస్తున్నారు. ఊళ్లల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో చాలా మంది దగ్గరలోని టౌన్లకు, సిటీలకు వలస బాట పట్టా రు. రోడ్లపై పండ్లు అమ్ముకోవటం, చేతివృత్తు లు చేసుకోవటం, రిపేరిం గ్ , మెకానిక్ వంటి పనులతో సరిపెట్టుకుంటున్నా రు. దేశ జనాభాలో ముస్లింల శాతం 13.4 అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ల శాతం 4.9 మాత్రమే. కేం ద్ర సర్వీసుల్లో మరీ తక్కువ(3.2 శాతం). సచార్ రిపోర్ట్​ తర్వాత ఏర్పడ్డ అనేక కమిటీలు కూడా దేశంలోని ముస్లింల స్థితిగతులపై పెదవి విరిచాయి. సామాజికంగా, ఆర్థికంగా ముస్లింలు అందరికన్నా వెనకబడి ఉన్నట్లు తేల్చిచెప్పాయి. మౌలిక విషయం ఏంటంటే ముస్లిం సమాజ సమస్యలను అర్థం చేసుకోవటంలో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నా యి. దీంతో ఎన్నేళ్లు గడిచినా అవి పరిష్కారా లకు నోచుకోవటంలేదు.

ఐడెంటిటీ క్రైసిస్
మిగతా సమాజాలు కెరీర్ ఓరియంటేషన్ తో ముం దుకెళ్తుం టే ముస్లిం సమాజం ఇప్పటికీ ఐడెం టిటీ క్రైసిస్ లోనే ఉంది. ముస్లిం పర్సనల్ లా, ఫత్వాలు వంటి మతపరమైన అంశాల చుట్టూ నే ముస్లిం సమాజం తిరుగుతోంది. సమస్యలను గుర్తించి పరిష్కారాలు సూచిం చే లీడర్ షిప్ ముస్లిం సమాజానికి లేకపోవడం దురదృష్టకరం. మొత్తంగా చూస్తే ముస్లిం సమాజంపై ఇ ప్పటి కీ మిగతా సామాజిక వర్గా ల్లో అపోహలు అలాగే ఉన్నాయి. నిజాలను అపోహలు డామినేట్ చేయటంతో ముస్లింల సమస్యలు ఎప్పటికీ సమస్యలుగానే ఉంటున్నాయి.

బెంగాల్ ముస్లింలలో పేదవాళ్లు ఎక్కువ
దేశవ్యాప్తంగా ముస్లింలలో మెజారిటీ వర్గం పేదవారే. అయితే సౌత్ లోని నాలుగు రాష్ట్రా లు, గుజరాత్ తో పోలి స్తే బెంగాల్ ముస్లింలలో పేదరికం మరింత ఎక్కువ. సంపన్న వర్గమంటూ ఎవరూ లేరు. మిడిల్ క్లాస్ చాలా తక్కువ. మెజారిటీ ముస్లింలంతా దారిద్ర్య రేఖకు దిగువనున్నవారే. దేశంలోని మిగతా ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువగా టౌన్లలో ఉంటే బెంగాల్ లో మాత్రం గ్రామాల్లోనే సెటిలయ్యారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. సౌత్ ఇండియన్ ముస్లింలలాగే బెంగాల్ ముస్లింలు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ముస్లింలను బుజ్జగించడానికి మమతా బెనర్జీ నాయకత్వం లోని బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొన్ని హిందూ మత సంస్థలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం
నిజం లేదు. కాం గ్రెస్ తోపాటు తమకు దూరంగా ఉండే ప్రాంతీయ పార్టీలపై కొన్నేళ్లుగా ఈ సంస్థలు ఈ తరహా ప్రచారం చేస్తున్నాయి. ఇది తప్పు అని చెప్పటా నికి ముస్లింల బతుకు చిత్రం మారకపోవడమే ప్రత్యక్ష ఉదాహరణ.

అందివచ్చిన భూ సంస్కరణలు
సీపీఎం నేతృత్వం లోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం అమలు చేసిన భూసంస్కరణల ప్రభావం ముస్లింలపై పడిం ది. ఇవి ఆర్థికంగా బలపడటానికి తోడ్పాటు నిచ్చాయి. తర్వాత వచ్చిన తృణమూల్ కాం గ్రెస్ ప్రభుత్వం కూడా ముస్లింల అభివృద్ధికి కృషి చేసింది. దీం తో ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల శాతం మెల్లమెల్లగా పెరిగింది. 2016 నాటికి బెంగాల్ సర్కార్ జాబుల్లో ముస్లింల శాతం 5.73. గత పదేళ్లతో పోలిస్తే ఇది 2.3 శాతం ఎక్కువ. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ లో చేరే ముస్లింల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది.

రాజకీయ రంగంలోనూ..
లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంతో పోలిస్తే తృణమూల్ కాంగ్రెస్ హయాంలో ముస్లింలు రాజకీయంగా ఎదిగారు. బెంగాల్ కేబినెట్ లో ముస్లింలకు మంత్రి పదవులు దక్కాయి. కోల్ కతా సిటీ మేయర్ గా ముస్లింకు అవకాశం దక్కటాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇన్నేళ్ల తర్వాత కూడా ముస్లిం సమాజం సమస్యల నుంచి పూర్తిగా బయటపడలేదన్నది నిజం. మతపరమైన అంశాలను పక్కనపెట్టి అభివృద్ధి దిశగా ముస్లిం సమాజాన్ని నడిపించే బలమైన నాయకత్వం చాలా అవసరం.
– మైదుల్ ఇస్లాం, విద్యావేత్త (వైర్ సౌజన్యంతో)