మెట్ పల్లి, వెలుగు : అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసి మత సామరస్యాన్ని చాటిచెప్పాడు. మెట్ పల్లికి చెందిన ముస్లిం సెంట్రల్ కమిటీ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ కుతుబుద్దీన్ పాషా ఆదివారం తన ఇంట్లో అయ్యప్ప స్వాములకు అన్నదానం( భిక్ష) ఏర్పాటు చేశారు. పీసీసీ ప్రతినిధి సుజిత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్ పాటు పలువురు స్వాములు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుజిత్ రావు మాట్లాడుతూ ముస్లిం కమిటీ నాయకుడు అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఇలాంటి ప్రోగ్రాంలు స్నేహభావాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయన్నారు. హిందూ ముస్లింలు భాయ్ భాయ్ లా కలసి మెలసి ఉంటూ మతసామరస్యానికి ప్రతీకగా నిలువాలని కోరారు.