బక్రీద్ ఫెస్టివల్.. దేశభక్తి భావాన్ని చాటిన ముస్లిం సోదరులు

బక్రీద్ ఫెస్టివల్..  దేశభక్తి భావాన్ని చాటిన ముస్లిం సోదరులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముస్లిం సోదరులు తమ దేశభక్తిని చాటుకున్నారు. 2024, జూన్ 17వ తేదీ సోమవారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలో ముస్లింలు సోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని ఈద్గాల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరై ప్రార్థనలు చేశారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

పండగ సందర్భంగా జిల్లాలోని అశ్వారావుపేట ఈద్గ దగ్గర ప్రార్థనలు చేసేందుకు వచ్చిన ముస్లిం సోదరులు అందరినీ ఆకట్టుకున్నారు. మువ్వన్నెల త్రివర్ణ పతాకంలోని మూడు రంగుల వస్త్రధారణలు ధరించి దేశభక్తి భావాన్ని చాటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈద్గాలో సామూహిక  ప్రార్థనల్లో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు.  దైవప్రవక్త హాజ్రత్ ఇబ్రహీం అల్లాహ్ ప్రసన్నం కోసం చేసిన త్యాగానికి గుర్తుగా ముస్లింలు ఈ పండగ జరుపుకుంటారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు.