ఆమనగల్లు, వెలుగు: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసిందని ముస్లిం మైనార్టీ నాయకులు ఆరోపించారు. ఆదివారం పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం బంధును బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చిందని పేర్కొన్నారు.
మైనార్టీల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమైందని చెప్పే నాయకులు, ఆమనగల్లులో 20 ఏండ్లుగా అసంపూర్తిగా ఉన్న షాదీఖానాను ఎందుకు కంప్లీట్ చేయలేదో? చెప్పాలని డిమాండ్ చేశారు. ఖాదర్, గౌస్, ఖలీల్, షరీఫోద్దీన్, రహీం పాల్గొన్నారు.