రూ.1.02 లక్షలకు లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుమార్ జనతా గణేశ్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 48 అడుగుల భారీ గణపతి నిమజ్జనం సందర్భంగా లడ్డూని వేలం వేశారు. ఈ 21 కేజీల లడ్డూని దక్కిచుకునేందుకు ఔత్సాహికులు పోటీపడగా వేలంపాట హోరాహోరీగా సాగింది.

రూ. 5 వేల నుంచి వేలంపాట ప్రారంభం కాగా.. పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన ముస్లిం యువకుడు షేక్ అసిఫ్ రూ.లక్షా 2వేలకు లడ్డూని దక్కిచుకున్నాడు. మండప సభ్యులు యువకుడిని  శాలువాతో సన్మానించారు.