యూపీలో ఎస్పీ అధికారంలోకి రాదు:మాయావతి

యూపీలో ఎస్పీ అధికారంలోకి రాదు:మాయావతి

ఉత్తరప్రదేశ్ లో 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు.  బీఎస్పీ చీఫ్ మాయావతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూపీలో ఎస్పీ అధికారంలోకి రాదన్నారు మాయావతి. సమాజ్‌వాదీ పార్టీ పట్ల ముస్లింలు సంతోషంగా లేరు. ఎస్పీకి ఓటేస్తే గూండారాజ్, మాఫియా రాజ్ వస్తుందని యూపీ ప్రజలకు తెలుసు కాబట్టే వారికి ఓటు వేయరని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఎస్పీ ప్రభుత్వ హయాంలో అల్లర్లు జరిగాయని, తాము అధికారంలోకి రాలేమని ఎస్పీ నేతల ముఖాలు చెబుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తల కోసం

 

మధ్యప్రదేశ్లో ‘తెలుగు వెలుగు’

అల్లం నారాయణ సతీమణి మృతి