భక్తిశ్రద్ధలతో రంజాన్ .. ముస్లింలకు ప్రముఖుల శుభాకాంక్షలు

భక్తిశ్రద్ధలతో రంజాన్ .. ముస్లింలకు ప్రముఖుల శుభాకాంక్షలు

నెట్​వర్క్​వెలుగు :  రంజాన్​ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనా స్థలాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా, భారీ సంఖ్యలో ముస్లింలు చేరుకుని ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్​ ముబారక్​ అంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. 

పలుచోట్ల నిర్వహించిన ప్రార్థనల్లో చిన్నారులు ప్రత్యేక దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ప్రముఖులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పట్టణాల్లోని పలుచోట్ల ట్రాఫిక్​ జామ్​ కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.  ‌‌