కోల్బెల్ట్,వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యేగా డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గెలుపును పురస్కరించుకొని ముస్లింలు సంబురాలు జరుపుకున్నారు. శుక్రవారం మందమర్రి మార్కెట్ ఏరియాలోని మసీదులో ముస్లింలు, కాంగ్రెస్ లీడర్లు స్వీట్లు పంచారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును ఘనంగా సన్మానించారు. ముస్లింల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సదర్ గూలం, లతీఫ్, ఇషాక్, సజ్జు, హఫీజ్, జావేద్ఖాన్, అక్బర్, నజీర్, నల్లాల క్రాంతి, గుడ్ల రమేశ్, పుల్లూరి లక్ష్మన్, మహంతో అర్జున్, పులిపాక సదానందం తదితరులు పాల్గొన్నారు.