అయ్యప్ప భక్తులకు ముస్లింల అన్నదానం

కోల్​బెల్ట్, వెలుగు: ముస్లింలు మతసామరస్యాన్ని చాటుకున్నారు. అయ్యప్ప  మాలలు ధరించిన స్వాములకు అన్నదానం(బిక్ష) కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ​సొసైటీ ప్రెసిడెంట్, కాంగ్రెస్​ లీడర్ ఎండీ అబ్దుల్​అజీజ్​ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ ​కోదండరామాలయంలో శనివారం అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా అన్నదానం నిర్వహిస్తున్నామని.. హిందూ, ముస్లీంలు మధ్య సోదరభావం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.   మైనార్టీ కమిటీ మెంబర్లు నజీరోద్దిన్, ఖాజా, షఫీ, పాషా, గౌస్, మెరాజ్, అంకుష్​, ఇమామ్, స్థానిక కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.