
- హైదరాబాద్లోఎంఎస్ మక్తా నుంచిఅంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ
- జాతీయ జెండాలు, అంబేద్కర్ఫొటోలు, ఫ్లకార్డులతో ఆందోళన
- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ మద్దతు
ట్యాంక్ బండ్, వెలుగు: వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు ఆందోళన చేపట్టారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంఎస్‌మక్తా నుంచి నెక్లెస్‌రోడ్డు, ఇందిరాగాంధీ స్టాచ్యూ, ఐమాక్స్ థియేటర్, మింట్ కాంపౌండ్, సెక్రటేరియట్, ట్యాంక్బండ్అంబేద్కర్విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలు, అంబేద్కర్ఫొటోలు, నల్ల జెండాలు, ఫ్లకార్డులు పట్టుకొని.. వక్ఫ్‌సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నినదించారు. మరోపక్క ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మైనార్టీ నేత ఫాహిం ఖురేషీ మాట్లాడుతూ.. ‘వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం సమాజం ఆమోదించదు. ఇది ముస్లింలపై దాడిగా పరిగణిస్తున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి కూడా వక్ఫ్ సవరణబిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్అధినాయకత్వం కూడా పలు ప్రకటనలు చేసింది’ అని తెలిపారు. ర్యాలీకి మద్దతుగా కాంగ్రెస్పీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్‌నేత షబ్బీర్‌అలీ అక్కడికి రాగా, వారికి ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు.