మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో ముస్లింల భారీ ర్యాలీ

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో ముస్లింల భారీ ర్యాలీ

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి నిరసనగా శుక్రవారం మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో జుమా నమాజ్ తర్వాత పాత బస్టాండ్ బిస్మిల్లా మసీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఆర్డీవో ఆఫీసు వరకు  వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ ముస్లింలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించిందని మండిపడ్డారు. ముస్లిం సమాజానికి నష్టం కలిగించే ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో ముస్లింసెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్ అఖ్తర్ జాని, వైస్ ప్రెసిడెంట్ తమీజుద్దిన్, జేఏసీ లీడర్లు పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జీలతో నిరసన 

ఎల్లారెడ్డిపేట, వెలుగు: వక్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో ముస్లింలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైనార్టీ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు సాహెబ్, ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్, హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సల్మాన్, జకీర్, కరీం, ఖాదీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.