నియంతల పేర్లన్నీ ‘M’తోనే ఎందుకు మొదలవుతాయి?

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ పేరు తీసుకోకుండా ఆయనపై కామెంట్స్ చేశారు. ఎందుకు చాలా మంది నియంతల పేర్లు ఆంగ్ల అక్షరం ‘M’తో మొదలవుతాయని మోడీని ఉద్దేశించి ఇన్‌‌డైరెక్ట్‌‌గా రాహుల్ ట్వీట్ చేశారు. ఇటలీ మాజీ ప్రధాని బెనిటో ముస్సోలినీ, పాకిస్థాన్ మాజీ పీఎం పర్వేజ్ ముషారఫ్, ఈజిప్ట్ మాజీ ప్రెసిడెంట్ హోస్ని ముబారక్‌‌తోపాటు పలువురు నేతల పేర్లను ఈ ట్వీట్‌లో ఉదహరించారు.

ఇండో-చైనా బార్డర్ వివాదం పైనా రాహుల్ కామెంట్ చేశారు. ఒకవైపు సరిహద్దుల్లో చైనా తన బలగాలను మోహరిస్తుంటే ప్రధాని ఆ దేశం గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని రాహుల్ విమర్శించారు. ఇలాంటి సమస్యను పరిష్కరించడానికి దమ్ము కావాలని, అది మోడీకి లేదన్నారు.