హైదరాబాద్: సైబర్ క్రైమ్ పెను సవాల్‌గా మారిందని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉండాలన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో 76వ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఉండాలన్నారు.
సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌తో పాటు ఇతర అనేక సైబర్ సంబంధిత కార్యక్రమాలు కేంద్ర హోంశాఖ పరిధిలోకి వచ్చాయని తెలిపారు. నేరస్తులను పట్టుకొని వారికి తొందరగా శిక్షలు పడేలా చూడాలన్నారు. కొత్త క్రిమినల్ చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కాగా నేషనల్పోలీస్అకాడమీలో అకాడమీలో 188 మంది ట్రైనీ ఐపీఎస్‌లు ట్రైనింగ్ పూర్తిచేస్తున్నారు. వీరిలో 54 మంది మహిళలు ఉన్నారు. ఏపీకి 4, తెలంగాణ నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించారు.