ఫ్లైట్ జర్నీ అంటే చాలామందికి ఎగ్జిట్ మెంట్ ఉంటుంది. ఆ ఎగ్జెటెమెంట్ అలాగే కంటిన్యూ అవ్వాలంటే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా మొదటిసారి విమానం ఎక్కబోతున్న వాళ్లు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.
- ఫైట్ టికెట్ బుక్ చేసుకునే ముందు లగేజీ కెపాసిటీ ఎంతో తెలుసుకోవాలి. కొన్ని డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ 25 కేజీల వరకు మాత్రమే అనుమతిస్తాయి. బరువు దాటితే అదనపు ఛార్జీలు ఉంటాయి. అలాగే లగేజీలో ఎలాంటి వస్తువులు తీసుకెళ్లకూడదో ముందే గైడ్లైన్స్ చదివి తెలుసుకోవాలి.
- విమానం ఎక్కేముందు కొన్ని చెక్ఇన్ ఫార్మాలిటీస్, సెక్యూరిటీ చెకింగ్స్ పూర్తి చేయాలి.కాబట్టి ప్రయాణానికి కనీసం రెండు గంటల ముందే ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలి.
- విమానం క్యాబిన్లోకి తీసుకెళ్లే బ్యాగు ఏడు కేజీల కంటే తక్కువ బరువు ఉండాలి. కాబట్టి ఆ బ్యాగులో అత్యవసరమైనవి. మాత్రమే ఉంచుకోవాలి.
- ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఐడీ కార్డ్స్, టికెట్స్, బోర్డింగ్ పాస్ లాంటివి ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి.
- ఫ్లైట్ ఎక్కిన తర్వాత క్యాబిన్ క్రూ చెప్పిన జాగ్రత్తలు తప్పక పాటించాలి. విమానం టేకాఫ్, ల్యాండింగ్ టైంలో మొబైల్ వాడకూడదు. కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.
- మొదటిసారి విమానం ఎక్కేవాళ్లు ఎయిర్ లైన్స్ గైడ్ లైన్స్ పూర్తిగా చదవాలి. ఫ్లైట్ ఎక్కేముందు స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి చేయకూడదు. వేసుకునే బట్టలు సింపుల్గా, కంఫర్టబుల్గా ఉండాలి. కొన్ని ఎయిర్ లైన్స్ రూల్స్ ప్రకారం గర్భిణులు విమానం ఎక్కా లంటే డాక్టర్ సర్టిఫికెట్ అవసరం ఉండొచ్చు.