T20 World Cup 2024: కెనాడాతో కీలక మ్యాచ్.. పాకిస్థాన్‌కు చావో రేవో

T20 World Cup 2024: కెనాడాతో కీలక మ్యాచ్.. పాకిస్థాన్‌కు చావో రేవో

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన బాబర్ సేన సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 11) కెనడాతో అమీ తుమీ తేల్చుకోనుంది. సూపర్ 8 రేస్ లో నిలవాలంటే పాక్ ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్ ఓడిపోతే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
 
పాక్ సూపర్ 8 కు వెళ్లాలంటే..?
 
చివరి వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన పాకిస్థాన్ ప్రస్తుత వరల్డ్ కప్ లో సూపర్ 8 చేరుకోవడానికి కష్టాలు పడుతుంది. రెండు మ్యాచ్  లాడినా పాక్ జట్టు ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. నేడు జరిగే కెనడాతో పాటు ఐర్లాండ్ పై తప్పకుండా విజయం సాధించాలి. ఈ రెండు మ్యాచ్ లు గెలవడంతో పాటు ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్, అమెరికా మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిస్తే పాకిస్థాన్ తమ చివరి రెండు మ్యాచ్ లు గెలిచినా ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. ఒకవేళ వర్షం పడి ఏదైనా మ్యాచ్ రద్దయితే పాక్ ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా టర్న్ నుంచి నిష్క్రమిస్తుంది.

మరోవైపు ఈ మ్యాచ్ కెనడాకు కీలకంగా మారింది. తొలి మ్యాచ్ లో అమెరికాతో ఓడిపోయిన కెనడా.. ఐర్లాండ్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఓడిపోతే చివరి మ్యాచ్ లో భారత్ పై తప్పకుండా గెలవడంతో పాటు ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. దీంతో ఈ రోజు పాకిస్థాన్ కు గట్టి పోటీ ఇవ్వడానికి కెనడా సిద్ధంగా ఉంది.  
            
తుది జట్లు అంచనా 

పాకిస్థాన్:

బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్/ఉస్మాన్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వాసిం, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ అమీర్.

కెనడా:

ఆరోన్ జాన్సన్, నవనీత్ ధాలివాల్, పర్గత్ సింగ్, దిల్‌ప్రీత్ బజ్వా, నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వా (వికెట్ కీపర్), దిలోన్ హేలిగర్, సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్.