ఢిల్లీ  మెడలు వంచాలంటే ఎక్కువ MP సీట్లు గెలవాలి: KTR

ఢిల్లీ మెడలు వంచాలంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలన్నారు TRS పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్‌ మాట్లాడారు. ఢిల్లీలో మన వాళ్లు ఉంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవచ్చన్నారు. కరీంనగర్‌ జిల్లాలో రైలు రావాలంటే ఎంపీలు ఢిల్లీ మెడలు వంచే పరిస్థితి ఉండాలన్నారు. ఇద్దరు ఎంపీలతోనే కేసీఆర్‌ తెలంగాణ తెచ్చారని గుర్తు చేశారు. 16 మందిని గెలిపిస్తే ఇంకెంత చేస్తారో ఆలోచించాలన్నారు కేటీఆర్.

పింఛను వయసు తగ్గించడంతో మరో 8 లక్షల మందికి పింఛన్లు అందుతాయన్నారు కేటీఆర్. కాళేశ్వరం పూర్తయితే కాలువలన్నీ నీళ్లతో కళకళలాడుతాయని తెలిపారు. రూ.80వేల కోట్ల రాష్ట్ర నిధులు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణకు రూ.25వేలు కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. మోడీ నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న రాష్ట్రాలకే మోడీ నిధులు ఇస్తున్నారన్నారు.