సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్కు తన సొంత నియోజకవర్గంల సిరిసిల్లలో షాక్ తగిలింది. ముస్తాబాద్ జడ్పీటీసి గుండం నర్సయ్య బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేశారు. ఆయనబాటలోనే మరి కొంత మంది సర్పంచులు, 8 మంది మాజీ సర్పంచులు, 60 మందికిపైగా మాజీ వార్డు మెంబర్లు, ఇంకా 80 నుంచి 100 దాకా లీడర్లు, కార్యకర్తలు పార్టీకి రిజైన్చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1000 మందిమి పార్టీమారుతున్నామన్నారు. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో వీరంతా కాంగ్రెస్ లో చేరనున్నారు.