ఐపీఎల్ లో తొలి రెండు మ్యాచ్ లు ఈజీగా గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ షాక్ ఇచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి చెన్నైను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ తర్వాత సూపర్ కింగ్స్ ఏప్రిల్ 5న సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడబోతుంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు ముందు చెన్నైకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్వదేశానికి వెళ్ళిపోయాడు. దీంతో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు ఈ బంగ్లా బౌలర్ దూరమయ్యాడు.
ఐపీఎల్ ముగిసిన వారం రోజుల గ్యాప్ లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. జూన్ 1 నుంచి ఈ పొట్టి సమరం ప్రారంభమమవుతుంది. యూఎస్ఏ, వెస్టిండీస్ ఈ టోర్నీకి సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. దీంతో అన్ని దేశాల బోర్డులు క్రికెటర్లకు వీసాలు ఇప్పించడంలో బిజీ అయిపోయాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వీసా కోసం స్వదేశానికి రావాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో ముస్తాఫిజుర్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. సన్ రైజర్స్ తో మ్యాచ్ తర్వాత జట్టులో చేరతాడు.
ALSO READ :- IPL 2024: వావ్ మయాంక్.. తన రికార్డు తనే బద్దలు కొట్టాడు
ప్రస్తుతం ఐపీఎల్ లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ ల్లో 7 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో నాలుగు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. స్లో బౌన్సర్స్, యార్కర్లు సంధించడంలో ఈ బంగ్లా స్టార్ బౌలర్ దిట్ట. ఇతను లేకపోవడం చెన్నై జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. పతిరానా, చాహర్,తుషార్ దేశ్ పాండే త్రయం ముస్తాఫిజుర్ లేని లోటుని తీరుస్తారో లేదో చూడాలి.
Mustafizur Rahman unavailable for the match against SRH. He has flown back to Bangladesh for the USA Visa process. (Cricbuzz). pic.twitter.com/rXyyo2F4a3
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 3, 2024