క్రికెట్ లో ఊహించని ప్రమాదాలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని సమయాల్లో మాత్రం అదృష్టం కలిసి వచ్చి తృటిలో ప్రమాదం నుండి బయటపడతారు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజార్ కి అలాంటి పరిస్థితి ఏర్పడింది. బౌలింగ్ వేస్తూ గాడి తప్పిన ముస్తాఫిజార్ ఆ వెంటనే కంట్రోల్ చేసుకొని తనను తాను పెద్ద గాయం కాకుండా రక్షించుకున్నాడు.
వరల్డ్ కప్ లో భాగంగా పంజాబ్ లోని ధర్మశాలలో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచు జరుగుతుంది. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి బంగ్లా బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఇక విషయానికి వస్తే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 22 ఓవర్లో బౌలింగ్ వేయడానికి వచ్చిన ముస్తాఫిజార్.. రూట్ కి తొలి బంతి వేయడానికి వచ్చినప్పుడు బంతిని రిలీజ్ చేసే చివరి సెకన్ల లో రూట్ పక్కకి జరిగాడు. దీంతో బాల్ రిలీజ్ చేయకుండా కంట్రల్ చేసుకుందామనుకున్న ముస్తాఫిజార్ అంపైర్ వైపు చూసే క్రమంలో తనను తాను నియంత్రణ కోల్పోయి కింద పడ్డాడు.
- ALSO READ| Cricket World Cup 2023: హైదరాబాద్లో చివరి మ్యాచ్ ఆడుతున్న పాక్.. చిన్న పిల్లలతో బాబర్ ముచ్చట్లు
ఈ సమయంలో ఈ బంగ్లా పేసర్ కి గాయమైందనా.. ఆ వెంటనే చికిత్స తర్వాత కోలుకున్నాడు. కాగా.. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 364 పరుగుల భారీ స్కోర్ చేయగా.. 8 వికెట్లను 215 పరుగులు చేసి ఓటమి వైపుగా పయనిస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటర్ మలాన్ భారీ శతకం చేయగా.. టాప్లె 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు.