బంగ్లాదేశ్ స్టార్ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్ లో ముస్తాఫిజుర్ తలకు గాయం కావడంతో వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఛటోగ్రామ్‌లోని ఆసుపత్రికి తరలించారు. BPL లో సోమవారం(ఫిబ్రవరి 19) న సిల్హెట్ స్ట్రైకర్స్‌తో కొమిల్లా.. తమ తదుపరి మ్యాచ్ కు సిద్ధమవుతున్నప్పుడు ఆదివారం (ఫిబ్రవరి 18) ఉదయం ఈ సంఘటన జరిగింది.
ప్రాక్టీస్ లో భాగంగా పక్కనే ఉన్న నెట్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు లిట్టన్ దాస్. అతను కొట్టిన ఒక బాల్ నేరుగా వచ్చి.. బౌలింగ్ వేసేందుకు వెళ్తున్న ముస్తిఫిజుర్ తలకు తగిలింది. దీంతో అతను తలపట్టుకని కింద పడిపోయాడు. ప్రాక్టీస్ సమయంలో ఒక బంతి నేరుగా ముస్తాఫిజుర్ రహ్మాన్ తలకు ఎడమ వైపు బలంగా తగిలింది. రక్తస్రావం ఆపడానికి మేము కంప్రెషన్ బ్యాండేజ్‌వేశామని.. ఆ తర్వాత వెంటనే అతన్ని ఇంపీరియల్ ఆసుపత్రికి తరలించామని టీమ్ ఫిజియో తెలియజేశారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మెగా లీగ్ లో ఈ పేస్ బౌలర్ కొమిల్లా విక్టోరియన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ముస్తాఫిజర్ ను కనీస ధర 2 కోట్లు పెట్టి దక్కించుకుంది. ఈ గాయం బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు.. చెన్నై ఫ్యాన్స్ ను కూడా కలవరానికి గురి చేస్తుంది. ఆస్పత్రిలో స్కాన్‌లు తీసిన తర్వాత.. ప్రాణాలకు ప్రమాదం ఏం లేదని వైద్యులు నిర్ధారించారు.తలపై కొన్ని కుట్లు పడ్డాయని.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడని నివేదికలు చెబుతున్నాయి.
Mustafizur Rahman has been taken to the hospital after sustaining a nasty blow to his head during Comilla Victorians' training session.
— CricTracker (@Cricketracker) February 18, 2024
(via @BDCricTime)pic.twitter.com/ZIa3lh7wbf