డిఫెండింగ్ చాంపియన్ గా వరుసగా రెండు విజయాలు.. ఆ తర్వాత రెండు అనూహ్య ఓటములు.. ఇది ప్రస్తుతం ప్రస్తుత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి. తిరుగులేదు అనుకున్న జట్టే ఇప్పుడు విజయం కోసం ఆరాటపడుతుంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 8) కోల్‌కతా నైట్ రైడర్స్ తో కీలక పోరుకు సిద్ధమవుతుంది. సొంతగడ్దపై ఎలాగైనా విజయం సాధించాలనే ఆత్మా విశ్వాసంతో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. చెన్నై జట్టులో ఇద్దరు విదేశీ పేసర్లు నేటి మ్యాచ్ లో ఆడటం దాదాపుగా ఖాయమైంది.
నివేదికల ప్రకారం.. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్, శ్రీలంక పేస్ సంచలనం మతీషా పతిరానా చెన్నై జట్టులో చేరారు. సన్ రైజర్స్ తో జరిగిన చివరి మ్యాచ్ కు వీరిద్దరూ అందుబాటులో లేని సంగతి తెలిసిందే. వీరిద్దరూ లేకపోవడంతో చెన్నై బౌలింగ్ లో బలహీనంగా కనిపించింది. పతిరానా గాయంతో ఇబ్బంది పడగా.. ముస్తాఫిజుర్ వీసా కారణాల వలన బంగ్లాదేశ్ కు వెళ్ళిపోయాడు. అయితే వీరిద్దరూ జట్టులో కలవడంతో పేస్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తుంది.
చాహర్, శార్దూలు ఠాకూర్, తుషార్దేశ్ పాండే రూపంలో పేస్ బౌలింగ్ దుర్బేధ్యంగా ఉంది. రవీంద్ర జడేజా, తీక్షణ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉండనే ఉన్నారు. మరోవైపు బ్యాటింగ్ లో గాడిలో పడాల్సి ఉంది. దూబే మినహా ఎవరూ నిలకడగా రాణించడం లేదు. ముఖ్యంగా కెప్టెన్ గైక్వాడ్, మిచెల్ ఫామ్ లో లేకపోవడం ఆ జట్టును కలవరానికి గురి చేస్తుంది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన చెన్నై సొంతగడ్డపై మరో విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.
Mustafizur Rahman & Matheesha Pathirana will Play against KKR at Chepauk.🔥🤩#CSK #IPL2024 pic.twitter.com/Bl9PFVZTLM
— Crictips (@CrictipsIndia) April 8, 2024