
జాగీరు భూములకు రిజిస్ట్రేషన్ చేసి ప్రైవేటు వ్యక్తులకు పట్టా దారు పాసు పుస్తకాలు ఇవ్వడమే కాకుండా ఇందులో సంస్థాన భూములను, అగ్రహార భూములను, మక్తా భూములను, ఉమ్లా ,ముకాస భూములను అనర్హులకు రిజిస్ట్రేషన్ చేశారు. అంతే కాకుండా మియాపూర్ భూముల కుంభకోణం, అక్రమ రిజిస్ట్రేషన్ల నేపథ్యం లో1971–తెలంగాణ భూమి హక్కులు, పట్టా దారుల పాసుపుస్తకాల చట్టాన్ని సవరించడానికి 2017 జూన్ 30న రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఆర్డినెన్స్ ను జారీ చేసింది.
ముఖ్యాంశాలు
- భూములు రిజిస్ట్రేషన్ చేసిన 15 రోజుల్లోమ్యుటేషన్ (రికార్డుల్లో మార్పులు) చేసేలా సవరణ చేశారు. ఇది గతంలో 90 రోజులుఉండేది.
- మ్యుటేషన్ దరఖాస్తుకు రశీదు తప్పని -సరి. ఇప్పటివరకు భూమి హక్కులకుసంబంధించి పాసు పుస్తకం, టైటిల్డీడ్ వేరువేరుగా ఉండేది. ఇప్పుడురెండు కలిపే ఉంటాయి.
- గతంలో కౌలుదారులు, భూమి తనఖా పెట్టించుకున్నవారికి పాసుపుస్తకం జారీ చేసే అవకాశం ఉండేది. దీనిని తాజా ఆర్డినెన్స్ లోరద్దు చేశారు. ఇకపై భూ యజమానికి మాత్రమే పట్టా దారు పాసుపుస్తకం జారీ చేస్తారు.(కౌలుదార్లు, తనఖాదార్లు, రి-జిస్ట్రేషన్లు చేయించుకునే వారికి ఇప్పుడు అవకాశం లేదు.)
- ఇప్పటివరకు పుస్తకాలుగా ఉన్న పట్టా దారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్‌లను ఎలక్ట్రానిక్ లేదా సాఫ్ట్ కాపీగా ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డుల్లో భద్రపరుస్తారు. దీనికి చట్టబద్ధత కల్పించి రుణాలు, ఇతర అవసరాలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేశారు.
- టీఎల్‌ఆర్‌ఎంఎస్ – తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ మెయింటెనెన్స్ అనే వెబ్ ల్యాండ్‌లో ఎలక్ట్రానిక్ పాస్‌బుక్‌ను అప్ లోడ్ చేస్తారు. వీటిని బ్యాంకులు, రుణసంస్థలు ఆమోదించాలనితెలిపింది.
- భూమి కొనుగోలు సహా ఏ రూపంలోనైనా ఆస్తిని సమకూర్చుకున్న వారు 30 రోజుల్లోగా రాతపూర్వకంగా తహసీల్దార్‌కు తెలియజేయాలి. దీనిపై ఎంఆర్‌వో రశీదునుఅందించాలి.
- గతంలో రెవెన్యూ రికార్డుల్లో జరిగిన క్లరికల్ పొరపాట్లను ఎంఆర్‌వో తన సొంత నిర్ణయంతో మార్పు చేసే అవకాశం ఉండేది. ఇకపై దరఖాస్తు ఆధారంగానే వీటిల్లో మార్పులు చేయాలి.
- భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్‌లు విధిగా తెలంగాణ స్టేట్ వెబ్ ల్యాండ్‌లోని ఎలక్ట్రానిక్ విధానంలో ఉన్న రికార్డుల మేరకే రిజిస్ట్రేషన్లు చేయాలి.
- ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను జారీచేయడానికి గల కారణాలుగా సులభతర వాణిజ్య నిర్వహణ, పారదర్శకత, జవాబుదారీ తనాన్ని పెంచడానికే అని పేర్కొన్నది.
భూరికార్డుల ప్రక్షాళన
నల్సార్ యూనివర్సిటీకి చెందిన ఎం.సునీల్ కుమార్(భూరికార్డుల న్యాయనిపుణులు) ప్రకారం భూమి హక్కులకు సంబంధించి 76 రకాల సమస్యలున్నాయి. 90 శాతానికి పైగా భూరికార్డులు సక్రమంగా లేవని పేర్కొన్నా రు. దీంతో వరంగల్ జిల్లా లోని మానుకోట మండలం, పుట్టల భూపతిగ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టగా73మందికి మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో వారి పాసు పుస-్తకాలు నమోదై ఉన్నాయి. మిగిలిన వారికి అటవీభూములను పంపిణీ చేసినట్లు ఉంది. వీరికి బ్యాంకుల్లో రుణాలు, పంటల బీమా, ప్రభుత్వపథకాలు వర్తించవు. దీంతో ఎంతో శ్రమతోవారికి టైటిల్ డీడ్ పట్టా దారు పాసు పుస్తకాలను ఇప్పించి పంటల రుణాలు, బీమా, ఇతర ప్రభుత్వ పథకాలు వర్తించేలా చేశారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 4వేల పెట్టుబడి ప్రోత్సహం అందించేందుకు భూరికార్డుల ప్రక్షాళన చేశారు.
భూహక్కులు – చారిత్రక నేపథ్యం
తెలంగాణలో భూమి కొనుగోలు, అమ్మకం నోటిమాట ద్వారా జరిగేది. దాన్ని సాగుచేసే రైతు దానిపై హక్కులు అతనికే కలవని భావించేవాడు.తెల్ల కాగితాలపై అమ్మటం – కొనుగోలు వివరాలు రాసుకునేవారు. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిగా 1971లో ‘రికార్డ్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్’ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా తెల్ల-కాగితాల మీద రాసుకున్న వాటిని 13 బీ సాదా బైనామాల కింద రిజిస్ట్రేషన్ చేశారు. ఈ చట్టం ప్రకారం 1బీ అనగా ప్రభుత్వం దగ్గరున్న కాపీ.2014 జూన్ 2నాటికి రిజిస్ట్రేషన్ అయినవాటిని పార్ట్–ఎ (ఎలాంటి విభేదాలు లేకుండా),వివాదాలు గల భూములను (అసైన్డ్, వారసత్వ,భూసేకరణ) పార్ట్–బిలుగా గుర్తించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పార్ట్–ఎ భూములకుపట్టా దారు పాసు పుస్తకాలు జారీ చేసి నిజమైన యజమానులుగా గుర్తించాలి.(2000 డిసెంబర్ 31నాటికి ఉన్న రిజిస్ట్రే-షన్లు, తెల్లకాగితాలను పరిగణలోకి తీసుకో-వాలి).
- రాష్ట్రంలో 2.76 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో రెవెన్యూ గ్రామాలు 10,885 ఉన్నా యి. వీటిలో 10,806 గ్రామాల్లో గ్రామీణ వ్యవసాయం ఉంది. మిగిలిన 79 గ్రామాలు హైదరాబాద్,రంగారెడ్డి ప్రాంతాల్లో ఉన్నాయి. దీనికోసం 1418 బృందాలుగా సిబ్బందిని విభజించారు. సుమారు పార్ట్–ఎలో 87శాతం పూర్తయింది. మిగిలిన 13శాతం పార్ట్–బి (సత్వరం పరిష్కరించలేని భూములు)లో కలవు.
- భూరికార్డుల్లో భాగంగా భూ హక్కులను పరిరక్షించాలంటే సేత్వా డ్, టిప్పన్ 1బీ పహాణిలోఒకే పేరు మీద ఉండాలి. భూ యజమానిని ,అప్పుడు మాత్రమే భూమిపై హక్కులు పొందినట్టు, రికార్డు ప్రక్షాళన జరిగినట్టు లెక్క.
- భూవివాదాల వల్ల 66శాతం సివిల్ వివాదాలు భూవివాదాల వల్లే జరుగుతున్నాయి. దీనివల్ల రూ.25వేల కోట్లు దారి ఖర్చులకే అవుతున్నాయి.
- నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)ప్రకారం 14శాతం మర్డర్లు భూవివాదాలవల్లే జరుగుతున్నా యి. భూవివాదాల వలనఒక ఎకరానికి రూ.లక్ష నష్టం వాటిల్లుతుంది.జీడీపీలో 1శాతం నష్టం వస్తోంది.
- సులభతర వాణిజ్య ర్యాంకులలో కూడా భూ-వివాదాలు తక్కువగా ఉన్న రాష్ట్రాలకే ఉత్తమ ర్యాంకు లభిస్తుంది. వీటన్నింటి నేపథ్యంలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టింది.
సవాళ్లు
రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా స్టాండ్ డ్యూటీ రద్దు చేసింది. దరఖాస్తు చేయడం నుంచి 13 బీ వరకు భూ రికార్డుల ప్రక్షాళన అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతుంది. నోటి మాటమీద జరిగిన భూ పట్టాలను ఇవ్వాలని గవర్నర్ ఆదేశాలు ఇవ్వటం ఉత్తమ పనే కానీ ఇంకా పూర్తిస్థాయిలో భూ హక్కులకు రక్షణ కల్పించాలి. ఉదాహరణకు కెనడాలో మాదిరిగా ప్రిజన్ టు ల్యాండ్ రికార్డ్స్(భూమి హక్కులకు ఇన్య్సురె న్స్ కల్పించటం) అనే పద్ధతి పాటిస్తే నిజమైన లబ్ధిదారులకు సంపూర్ణ అధికారం లభించనుంది. భూమి హక్కులకు కెనడాలో మాదిరిగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తే భూములపై సంపూర్ణ హక్కులు కలిగి ఉంటే అప్పుడు మాత్రమే భూరికార్డుల ప్రక్షాళన సంపూర్ణమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటివరకు జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 99శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తయింది. నల్గొండ జిల్లాలో 96శాతం, సూర్యాపేటలో 96శాతం కాగా, 14 జిల్లాల్లో 95శాతం పూర్తయింది.