
- గ్రూప్ 2లోనూ 143వ ర్యాంకు
ముత్తారం, వెలుగు: ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన గంట మహేశ్‌గౌడ్ గ్రూప్3లో స్టేట్ 21వ ర్యాంకు సాధించాడు. రెండు రోజుల కింద విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో 143వ ర్యాంక్ సాధించిన ఆయన.. గ్రూప్ 3లోనూ సత్తాచాటాడు. గతంలో గ్రూప్ 4 సాధించి ప్రస్తుతం పెద్దపల్లి పీఆర్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. జేఎన్టీయూ కాలేజీలో మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన మహేశ్ ఇంటర్ మంథనిలో పూర్తి చేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నట్లు మహేశ్ తెలిపారు.
ఇల్లందకుంట వాసికి 72వ ర్యాంక్
జమ్మికుంట, వెలుగు: ఇల్లందకుంట మండలకేంద్రానికి చెందిన కాంతాల సాయి ప్రశాంత్‌రెడ్డి గ్రూప్ 3లో స్టేట్ 72వ ర్యాంకు సాధించాడు. ప్రశాంత్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. ఇటీవల విడుదలైన గ్రూప్ 2లోనూ సత్తా చాటాడు.