లంబాడాలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సే

లంబాడాలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సే
  • వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య

హైదరాబాద్, వెలుగు: లండాలను ఎస్టీలుగా గుర్తించి రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అటవీ హక్కుల చట్టం తెచ్చి లక్షల ఎకరాలు గిరిజనులకి పంచిందన్నారు.  ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ర్ట  గిరిజన సంఘం ( టీఆర్ జీఎస్ ) ఏర్పాటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

 సంఘం రాష్ర్ట అధ్యక్షుడిగా దీరావత్ రవినాయక్ ను నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా గిరిజనుల హక్కులు, వారి సంక్షేమ కోసం ఉద్యమిస్తున్న వ్యక్తి రవినాయక్ అని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ సర్కారే గిరిజనుల కోసం ప్రత్యేక విద్యాలయాలు తీసుకొచ్చిందని ఇప్పుడు ఉన్నత ఉద్యోగాల్లో వారు ఉండేలా కృషి చేసిందని తెలిపారు.