కుంటాల, వెలుగు: దైవ భక్తుడైన సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాల అభివృద్ధి జరిగిందని ముథోల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం కుంటాల మండలంలోని అంబకంటి తండాలో జగదంబా దేవి, రాంరావు మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కృషితో జగాదాంబదేవి ఆలయ నిర్మాణం కోసం రూ.45 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
మండలంలోని ఆయా గ్రామాల్లో పురాతన దేవాలయాల అభివృద్ధి, ఆలయాల నిర్మాణం కోసం భారీగా నిధులు వెచ్చించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లు జాదవ్ శంకర్, ముజిగె ప్రవీణ్, జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు రాథోడ్ విమల, నాయకులు బుచ్చన్న, గోకుల్, సుభాష్, రమేశ్, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.