
- ముథోల్ ఎమ్మెల్యేకి నిరసన సెగ
- గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్న స్థానికులు
- ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీత
లోకేశ్వరం: ముథోల్ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌జిల్లా లోకేశ్వరం మండలం ఎడ్దూర్ -పొట్ పెల్లి గ్రామానికి వెళ్లిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. తొమ్మిదేండ్లలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు.
అంతవరకు గ్రామాల్లోకి ఓట్లు అడగడానికి రావద్దన్నారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదని, అలాగే దళిత బంధు, బీసీ బంధు అర్హులకు ఇవ్వకుండా నాయకుల అనుచరులకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో ఎమ్మెల్యే వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు.