
న్యూఢిల్లీ: కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లు, క్రెడిట్ స్కోర్ సేవలను అందించే బ్యాంక్‌బజార్.కామ్, గోల్డ్ ఫైనాన్సియర్ ముత్తూట్ ఫిన్‌కార్ప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గోల్డ్ లోన్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సిరీస్ డీ2 రౌండ్‌లో భాగంగా బ్యాంక్‌బజార్‌లో రూ. 15 కోట్లను ముత్తూట్ ఇన్వెస్ట్ చేసింది. ఒక శాతం వాటా దక్కించుకుంది. బ్యాంక్‌బజార్ డాట్ కామ్ ఈ సిరీస్ డీ2 రౌండ్‌లో మొత్తం రూ. 55 కోట్లు సమీకరించగా, మిగిలిన రూ. 40 కోట్లు ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. కంపెనీ విలువ రూ.1,700 కోట్లుగా ఉంది.