సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహ పున:ప్రతిష్ఠ

సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహ పున:ప్రతిష్ఠ

సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని బుధవారం తిరిగి ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 8.33 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందన్నారు.

కేంద్ర మంత్రి జి.కిషన్​రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్​గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్​కొంతం దీపిక ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని తెలిపారు. పున:ప్రతిష్ఠలో భాగంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.