
వచ్చే ఎన్నికల్లో తాను మూడోసారి గెలవడం ఖాయమన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పార్టీ నిశితంగా పరిశీలిస్తుందన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలను మంత్రి కేటీఆర్ కట్టడి చేశారన్నారు. నియోజకవర్గంలో నేతలెవరూ ఎవరు గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీ ఎవరిని తప్పు పట్టదని.. డిస్టబెన్స్ చేసిన వారిని మాత్రమే తప్పుపడుతుందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులెవరూ బెంగ పెట్టుకోవద్దన్నారు. పార్టీ అందరిని ఆదరిస్తుందని అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఇబ్బంది పెట్టిన నాయకులు మరోసారి ఇబ్బంది పెట్టొద్దని కోరారు.
ALSO READ :దళితబంధు విధివిధానాలేంటి..? : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జనగామ టికెట్ కోసం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీపడుతున్నారు. ఇద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి మాటల యుద్దం జరుగుతోంది. అభ్యర్థిని ప్రకటించకుండా జనగామ టికెట్ ను పెండింగ్ లో పెట్టారు కేసీఆర్. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనని గత కొన్ని రోజులుగా నియోజకవర్గ నేతలు గందరగోళంలో ఉన్నారు.