గోదావరిఖని, వెలుగు: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మటన్, చికెన్ షాపులను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు ఆరెకటిక సంఘం అధ్యక్షుడు గొళికార్ రాము, జనరల్ సెక్రెటరీ గజభీంకార్‌నర్సోజీ తెలిపారు.
రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ట రోజు జీవహింసకు దూరంగా ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.