న్యూఢిల్లీ : మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గత ఏడాది మాదిరే 2024లోనూ దూసుకెళ్లింది. మ్యూచువల్ ఫండ్ల ఆస్తుల విలువ ప్రస్తుత సంవత్సరంలో రూ.17 లక్షల కోట్లు పెరిగింది. ఈక్విటీ మార్కెట్లలో జోష్, ఎకనమిక్ గ్రోత్ బాగుండటం, ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం ఇందుకు కారణాలు. రాబోయే సంవత్సరంలో ఎంఎఫ్‌ల ఆస్తులు భారీగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్రీసెర్చ్ డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపూర్కర్ చెప్పారు.
ఈక్విటీ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, ముఖ్యంగా సిస్టమాటిక్ఇన్వెస్ట్మెంట్ప్లాన్స్(సిప్‌లు) ద్వారా నిధులు ఎక్కువగా అందుతున్నాయని వివరించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 9.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటిలో సిప్ల వాటా రూ.2.4 లక్షల కోట్లు ఉందని అన్నారు. గత నెల నాటికి మ్యూచువల్ఫండ్స్అసెట్అండర్మేనేజ్మెంట్(ఏయూఎం) విలువ రూ.68 లక్షల కోట్లకు చేరింది.
గత ఏడాదితో పోలిస్తే వీటి విలువ 27 శాతం పెరిగింది. గత నాలుగేళ్లలో ఏయూఎం రూ.30 లక్షల కోట్లు పెరిగిందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ (యాంఫీ) వెల్లడించింది.