నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు : నిజామాబాద్పరిధిలోని ఆరు సెగ్మెంట్లలో సోమవారం 12 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు వేశారు. బాల్కొండలో బీఆర్ఎస్పక్షాన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ముత్యాల సునీల్‌రెడ్డి (కాంగ్రెస్), మంగళారం భోజన్న (ధర్మసమాజ్‌పార్టీ) నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ అర్బన్‌నుంచి కాంగ్రెస్అభ్యర్థిగా మహ్మద్‌అలీ షబ్బీర్తరఫున పార్టీ లీడర్లు నామినేషన్ సమర్పించగా, మహ్మద్ జహీరుద్దీన్(ఇండిపెండెంట్) నామినేషన్అందించారు.
బోధన్‌లో బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్‌రెడ్డి, మహ్మద్ సర్జీల్పర్వేజ్(ఆల్ ఇండియా మజ్లిస్ –ఏ–ఇంక్విలాబ్) రెండో సెట్నామినేషన్ సమర్పించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మైక గంగాధర్ (ఇండిపెండెంట్), బొంత సాయన్న (ఉత్తర రాష్ట్ర సమితి), బాన్సువాడలో కాంగ్రెస్ కాసుల బాలరాజ్‌తో పాటు ఆయన కొడుకు కాసుల రోహిత్, పుట్ట భాస్కర్(ఇండిపెండెంట్) నామినేషన్ అందజేశారు. కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తరఫున ఆయన వర్గీయుల నామినేషన్‌వేశారు. ఉడుతవార్ సురేశ్(బీఎస్పీ) బోలేశ్వర్(ధర్మ సమాజ్ పార్టీ), ఇండిపెండెంట్లుగా అబ్దుల్వాహేద్, మహేందర్‌రెడ్డి, వెంకట్రావు, కలారాం అశోక్, భార్గవి, శివ, సాయన్న నామినేషన్ వేశారు. జుక్కల్‌లో బీజేపీ అభ్యర్థి అరుణతార, ఎల్లారెడ్డిలో ఇండిపెండెట్అభ్యర్థి సంజీవులు నామినేషన్ వేశారు